పయనించే సూర్యుడు, మార్చి 28 రంగారెడ్డిజిల్లాప్రతినిధి(ఎస్ఎంకుమార్) “శేరిలింగంపల్లికి చెందిన బంగారు బా బు,హోప్ ఫౌండేషన్,తెలంగాణ హాకీ చైర్మన్ కొండ విజయ్ కుమార్ ను ఢిల్లీ ఇన్కమ్ టాక్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.న్యూఢిల్లీలో జరుగుతు న్న హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్స వానికి బయలుదేరిన కొండ విజయ్ కుమార్ ను హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో గురువారం సాయంత్రం స్థానిక ఐటీ అధికారులు అడ్డుకొని పాన్ కార్డు స్వాధీనం చేసుకున్నారు. తదనంతరం కొండ విజయ్ కుమార్ న్యూఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగగానే అక్కడి ఢిల్లీ ఇన్కమ్ టాక్స్ అధికారులు నలుగురు వారిని అదుపులోకి తీసుకొని ఎయిర్ పోర్టు లోనే విచారణ ప్రారంభించారు. ఎయిర్ పోర్టులో గోల్డ్ మెన్ కొండ విజయ్ కుమార్ ను ప్రశ్నిస్తున్న అధికారులు తనఒంటిపైన ఉన్న బంగారం మొత్తాన్ని సీజ్ చేయడంతో పాటు వారి పేరుతో ఉన్న స్థిర, చర ఆస్తుల వివరాలను” సేకరిస్తున్న అధికారులు అని చెబుతు న్నారని సమాచారం.