పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 28 సాలూర : సాలూర మండల కేంద్రంలో చేపట్టనున్న హిందూ సమ్మేళన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయవలసిందిగా కార్యక్రమం నిర్వహణ అధ్యక్షులు ముట్టెన్ ప్రకాష్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను మండల కేంద్రంలో శుక్రవారంఆవిష్కరించారు.ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం 5:30 కి సమ్మేళన కార్యక్రమం ప్రారంభమవుతుందని అధ్యక్షులు వెల్లడించారు.ఈ కార్యక్రమానికి వక్తగా కార్యవాహ రాజులవార్ దిగంబర్,ముఖ్య అతిథులుగా మహాదేవ్ ధర్మపీఠం గుడిమెట్ల శ్రీశ్రీశ్రీ సద్గురు మహాదేవ్ స్వామీజీ,శ్రీశ్రీశ్రీ బాలయోగి శ్రీ పిట్ల కృష్ణ మహారాజ్ మల్లారం హాజరు కానున్నారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆకుల నీలకంఠ్ రావు,సాలూర మండల హిందూ సమాజం,నిర్వహణ సమితి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.