పయనించే సూర్యుడు మార్చి 28 ఉట్నూర్ మండలం రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూర్:ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రిన్సిపల్ శ్రీ అరవింద్ తెలిపారు ఉట్నూర్ పరీక్షా కేంద్రంలో మొత్తం 624 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ఆయన పేర్కొన్నారు పరీక్ష నిర్వహణకు సంబంధించి అవసరమైన మౌలిక సదుపాయాలు పర్యవేక్షణ సిబ్బంది నియామకం మరియు భద్రతా చర్యలు పూర్తి చేసినట్లు వెల్లడించారు అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు పరీక్ష ప్రారంభానికి కనీసం ఒక గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలని హాల్ టికెట్‌తో పాటు చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాన్ని తప్పనిసరిగా తీసుకురావాలని కోరారు నిర్దేశించిన నిబంధనల ప్రకారం పరీక్షను పారదర్శకంగా క్రమబద్ధంగా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ స్పష్టం చేశారు.