అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారడీలు..

పయనించే సూర్యుడు మార్చి 29, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారడీలు నిరంతరం కొనసాగుతున్నాయన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి. శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆమె మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయకుండా తాత్సారం చేస్తున్నారన్నారు. అది కప్పిపుచ్చుకునేందుకు మరోసారి శాస్వత రాజధాని తీర్మానం అంటూ అసెంబ్లీ నిర్వహించడాన్ని తప్పుబట్టారు. అసెంబ్లీ లో చేసిన తీర్మానం మండలికి పంపించకుండా ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. దీనిబట్టి చంద్రబాబు కు చట్టసభల పై ఎంత గౌరవం ఉందో ప్రజలకు తెలిసిందన్నారు. ఏళ్లు గడుస్తున్నా ఏ ఒక్క రైతుకు ఫ్లాట్లు ఇవ్వకపోవడం పట్ల అక్కడి రైతులు తీవ్రమైన మనస్థాపంతో ఉన్నారని పేర్కొన్నారు. మంత్రి నారాయణ సమక్షంలో తన భూమిపై ప్రశ్నించిన రైతు రామారావు కుప్పకూలి మృతి చెందిన విషయాన్ని గుర్తు చేసారు నాగమణి. 2014 – 19 మధ్య సింగపూర్ సంస్థలకు నిర్మాణ కాంట్రాక్టుల పేరిట కాలయాపన చేసిన చంద్రబాబు తాత్కాలిక నిర్మాణాలను కూడా పూర్తి చేయలేకపోయారన్నారు. చంద్రబాబు చేసిన గారడీలను ఆనాడు కేంద్రంలో ఉన్న బిజేపి గ్రహించడం వల్లే రాజధానికి సహకరించలేదని తెలిపారు. అభివృధ్ధి వికేంద్రీరణ జరగాలని భావించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని తీసుకువచ్చారని గుర్తు చూస్తూ, కోట్లాది రూపాయిల ప్రజాధనం వృధా కాకుండా చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. అయితే ఈ రోజు నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశం కేవలం మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని దూషించడానికే అన్నట్టు ఉందన్నారు.. రాజధాని నిర్మాణ పనుల్లో గతంలో చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు అస్మదీయులకు కాంట్రాక్టులు అప్పగించి ప్రజాధనం దుర్వినియోగం చేసేందుకు ఇప్పటికే పావులు కదుపుతున్నారని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అమరావతికి వ్యతిరేకం అని చంద్రబాబు అండ్ కో లేని పోని దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. భూములిచ్చిన రైతులకు న్యాయం చేయడంతో పాటు, నిర్మాణ భారం ప్రజలపై పడకుండా చర్యలు చేపట్టాలన్నదే అధినేత జగన్ ఆకాంక్ష అని నాగమణి స్పష్టం చేసారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *