ఆదివాసులను దూసించిన ప్రభుత్వ విఫ్, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందళం అశోక్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

* ఆ ఎమ్మెల్యే తో సీఎం చంద్రబాబు నాయుడు ఆదివాసీ సమాజానికి బెశారత్తుగా క్షేమాపణ చెప్పించి టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి * ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుంజా డిమాండ్.

పయనించే సూర్యుడు ప్రతినిధి జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మార్చి 29 ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందళం అశోక్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ & క్రిమినల్ కేసులు పెట్టాలని, ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుంజా పత్రిక ముఖంగా డిమాండ్ చేసారు.ఒరిశా నుండి ఆంధ్ర ప్రాంతానికి వలస వచ్చి ఎస్టీ బెంతు ఒరియాలుగా చలామణి అవుతూ,తమ ప్రయోజనాలు దెబ్బతీస్తున్న విషయాన్నీ చెప్పుకుందామని, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టి ఎమ్మెల్యే, ప్రభుత్వ విఫ్ బెందళం అశోక్ వద్దకు వెళ్ళిన ఆదివాసీ నాయకులను ఆఫ్ నాలెడ్జ్ పెలోస్, బ్లేడి బాస్టేట్స్ అంటూ అవమానకరంగా బూతులు తిట్టదమేమిటని,వెంటనే అతనిని ప్రభుత్వ విఫ్ పదవీ నుండి తొలగించి,ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ&క్రిమినల్ కేసులు పెట్టాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ఆదివాసుల పట్ల అగౌరవంగా మాట్లాడలేదని, టిడిపి ప్రభుత్వంలో ఇలా కులాలను దూషిస్తూ మాట్లాడే వారికి స్థానం ఇవ్వరని ఆదివాసీ సమాజం కోరుకుంటుందని, బెశారత్తుగా ఏమ్మెల్యే అశోక్ తో ఆదివాసీ సమాజానికి క్షేమపన చెప్పించి అతనిని పార్టీ నుంచి తొలగించి పదవి నుంచి సస్పెండ్ చెయ్యాలని అనిల్ అన్నారు.వాస్తవానికి ఎమ్మెల్యే వెనకేసుకొస్తున్న వారు ఎస్టీ బెంతో ఒరియాలు కారని, ఒరిశా నుండి ఆంధ్ర ప్రాంతానికి వలస వచ్చిన బిసి-ఎ (వడ్డి) కులానికి చెంది వారన్నారు. వీరు ఆంధ్రలో ఎస్టీ బెంతో ఒరియలుగా చలామణి కావడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే చాలా మంది ఎస్టీ బెంతో ఒరియాలుగా నకిలీ సర్టిఫికెట్స్ తో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. వీరిని ఎస్టీ జాబితాలో తీసుకు రావడానికి ఇటివలే అసెంబ్లీ డిప్యూటి స్పీకెర్ రఘురామకృష్ణం రాజుని కలిసి, ఎస్టీ బెంతో ఒరియాలుగా గుర్తించాలని ప్రభుత్వ విఫ్ బెందేలం అశోక్ కోరరారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి, ఇతర ఆదివాసి సంఘాల ప్రతినిదులు ఎమ్మెల్యేను కలిసి తమ అభ్యంతరాలు వేవనేత్తారు. తన వద్ద సరియైన సమాదానం లేక, సహనం కోల్పోయి కొపోద్రిక్తుడై ఎమ్మెల్యే బూతులు తిడుతూ రెచ్చిపొయరు. ఇది ప్రజా ప్రతినిధి లక్షణం కాదని, తక్షణమే ప్రభుత్వ విప్ పదవి నుండి పోలగించాలని కోరారు. నకిలీ బెంతో ఒరియాల విషయంలో టిసిఆర్&టిఐ, రెవెన్యూ శాఖలు జరిపిన విచారనలలో కూడా వీరు ఎస్టీ బెంతో ఒరియాలు కరని, ఒరిశా నుండి ఆంధ్ర ప్రాంతానికి వలస వచ్చిన బిసి-ఎ (వడ్డి) కులానికి చెంది వారని గుర్తించిందని, ప్రభుత్వ విఫ్ బెందేలం అశోక్ తన రాజకీయ అధికారాన్ని ఉపయోగించి 27 వేల మంది నాన్ ట్రైబల్స్ ని అక్రమంగా ఎఎస్టీలలో కలపాలని చూస్తున్నారని ఆదివాసీ జెఎసి బృందం మండిపడింది. ఎమ్మెల్యే బెందళం అశోక్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ & క్రిమినల్ కేసులు పెట్టాలని, ప్రభుత్వం కేసు నమోదు, చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *