ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఆధ్యం పలికి హామీ నేవేర్చిన మంత్రి అడ్లూరి.

* హర్షం వ్యక్తం చేసిన సర్పంచ్, ఉప సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ.

పయనించే సూర్యుడు 29-3-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో నల్లగుట్ట ప్రాంతంలో ఎన్నో ఏళ్ళుగా రేషన్ తీసుకోవడానికి 2 కిలోమీటర్ పైగా నడవడానికి చాలా ఇబ్బంది గురైన ప్రజల ఆవేదన గుర్తించిన ఉప సర్పంచ్ గురిజల బుజ్జిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి తేదీ 30-12-2025 రేషన్ షాప్ కోసం విన్నపించుకోగా ప్రజల సమస్యపై వెంటనే స్పందించి సుమారు 400 వందల రేషన్ కార్డులతో ప్రజలకు అందుబాటులో సబ్ రేషన్ మంజూరు చెయ్యడం జరిగింది… అదేవిధంగా మూడునెలలకు సరిపడా రేషన్ సరకులు ఏప్రిల్ లో పంపిణీ చెయ్యడం జరుగుతుంది ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యపై వెంటనే స్పందించి హామీ నెరవేర్చిన మంత్రి కి ధన్యవాదాలు తెలిపి హర్షం వ్యక్తం చేసిన సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి, ఉప సర్పంచ్ గురిజల బుచ్చిరెడ్డి, గ్రామ పంచాయతీ పాలక వర్గం, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు , నల్ల గుట్ట ప్రజలు, యువకులు తదితరులు..ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *