
పయనించే సూర్యడు ప్రతినిధి మర్చి. 29.2026 పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం ఇందుకూరు పంచాయతీ కొత్త వీధి గ్రామం మర్చి. 26. 2026 గురువారం రాత్రి సమయంలో పులి దాడి చేయడంతో. మూడు గేదె దూడలు ఒక ఆవుని పెద్దపులి చంపడం జరిగింది. దీని విషయమై అప్పటికప్పుడు హోటా హోటైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అక్కడికి చేరుకోవడం జరిగింది. కానీ వారితో నలుగురు షూటర్లు వచ్చి ఉన్నారు. కానీ అక్కడే ఉన్న పులిని మాత్రం బంధించలేకపోయారు. కారణం ఏమిటో తెలియదు గానీ.అదే మైదాన ప్రాంతంలో అయితే ఉన్నపలంగా 24:00 గంటలలో దానిని బంధించి.ఎక్కడో తీసుకొని వెళ్లి వదల వదలడం. లేదా జూలో పెట్టడము గాని జరిగేది. కానీ మా గిరిజన ప్రాంతం కాబట్టి మా ఆదివాసులు మనుషులు కాదు. వారి పెంచుకున్న పశువులు కాదు.అనే భావనతోనే ఎదురుగా ఉన్న పెద్దపులిని కూడా బదించలేకపోయారు. ఇప్పుడు ఆ నాలుగు పశువుల వల్ల ఆ యొక్క ఆదివాసి గిరిజనుడు జీవనోపాధి కోల్పోయాడు.ప్రభుత్వం దానికి ఎంత నష్టపరిహారం ఇచ్చిన మళ్లీ అవి తిరిగి రాలేవు. వాటిని సంపాదించుకోవాలంటే ఆ ఆదివాసికి ఎంతకాలం పడుతుంది. ఎంతైనా మా ఆదివాసి ప్రాంతంలో పనిచేసే ప్రతి అధికారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పులిని బంధించి మా ఆదివాసులను పశువులను కాపాడవలసిందిగా కోరుచున్నాము.కానీ ఇకముందు మళ్ళీ పునరావృతం అయితే కనుక మా ఆదివాసుల యొక్క కోపానికి బాధకి ఆపులి బలికి గురవుతుంది. తరువాత ఎలా ఉన్నా సరే దానికి బాధ్యులు మా ఆదివాసులం కాదని పత్రిక ముఖముగా తెలియజేస్తున్నాము. నష్టపోయిన ఆదివాసికి తక్షణమే మూడు దూడలకు ఒక ఆవుకి నష్టపరిహారం చెల్లించవలసిందిగా. కోరడమైనది నష్టపరిహారం ఒక్కొక్క దూడకి 15000/-రూపాయలు,ఒక ఆవుకి 30000/-రూపాయలు నష్టపరహారం ఇవ్వవలసింది. భారత్ ఆదివాసి పార్టీ తరపున ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో భారత్ ఆదివాసి పార్టీ పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం ఇన్చార్జి మద్దిటి అంజి రెడ్డి,అడ్డపల్లి సత్యనారాయణ దొర,మడి తమ్మన్న దొర, నెక్కల శ్రీను తుర్రం రమేష్ దొర, కారం అశోక్ కుమార్ దొర,కారం రామస్వామి దొర ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.