గ్రామ పంచాయతీ అభివృద్ధే నా ధ్యేయం

* గ్రామ సర్పంచ్ - మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్

పయనించే సూర్యుడు, మార్చి 29 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలోని 9 వ వార్డులో గ్రామ సర్పంచి మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ శనివారం సీసీ రోడ్డు కు భూమి పూజ చేసి సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. గ్రామపంచాయతీ అభివృద్ధి నా లక్ష్యంగా చేసుకొని ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సిసి రోడ్ల లేని వార్డులలో సిసి రోడ్ లు నిర్మించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గిరి గౌడ్, ఉప సర్పంచి బస్నమోనీ శ్రీనివాస్, వార్డు సభ్యులు ముదికొండ కవిత రమేష్ , నాయకులు పాలాది రంగనాథం, పసునోజు పురుషోత్తం, గుద్దటి కిష్టల్, మసిగుండ్ల వెంకటేష్, పిల్లి దేవేందర్, సిరసనగండ్ల శేఖర్, మట్ట నగేష్ గౌడ్, మోర వేణు, తుంగ శ్రీను, మట్ట నాగార్జున, అన్నపు ప్రశాంత్, ఎండి ఖలీల్, ఎండి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *