చింతూరు వారపు సంత బహిరంగ వేలం పాట నిర్వహించడం జరిగింది

ఆరు లక్షల 65 వేల రూపాయలకు దక్కించుకున్న శ్యామల లలిత

పయనించే సూర్యుడు ప్రతినిధి జరిగిన జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మర్చి 29 పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు పంచాయతీ కార్యాలయంలో చింతూరు స్థానిక సర్పంచ్ కారం. కన్నారావు అధ్యక్షతన చింతూరు ఎంపీడీవో శ్రీనివాస్ దొర, డి డి ఓ చింతూరు సెక్రటరీ గుంపనపల్లి మోహన్ ఆధ్వర్యంలో ఈరోజు చింతూరు వారపు సంత బహిరంగ వేలం పాట నిర్వహించడం జరిగింది. ఈ వేలం పాటలో ఏడుగురు పాటదారులు పాల్గొన్నారు పంచాయతీ వారిపాట ఆరు లక్షలు రూపాయలునిర్ణయించగా వేలం పాటలో పాల్గొన్న సభ్యులు ఆరు లక్షల పదివేల రూపాయల నుండి ఆరు లక్షల 65 వేల రూపాయలు పాడి శ్యామల లలిత చింతూరు వారపు సంతబహిరంగ పాటను కైవాసం చేసుకున్నారు, ఈ బహిరంగ పాల్గొన్న పాట సభ్యులు, శ్యామల లలిత, లక్ష్మి, కారం సత్యవతి, బిజెపి మండల అధ్యక్షులు బట్ట లక్ష్మణ్, శీలం తమ్మయ్య, వీరబోయిన దిలీప్, దర్మల స్టాలిన్, జల్లి నరేష్, కాక సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు.