పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 29 జగ్గయ్యపేటమండలంలోని చిల్లకల్లు గ్రామంలో 2025_ 26 సంవత్సరానికిగాను ఇంటి పన్ను వసూళ్లు గ్రామ కార్యదర్శి బి శివాజీ ఆధ్వర్యంలో ముమ్మరంగా చేస్తున్నారు. మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి ఈ గ్రామంలో గ్రామ పచాయతీ అధికారులు, సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు. మార్చి 31 లోపు ఇంటి యజమానులు తమ ఇంటి పన్నును విధిగా చెల్లించి తమకు సహకరించాలని కోరారు. ఎవరైనా ఇంటి పన్ను చెల్లించనట్లయితే వారి ఇల్లు జప్తు చేస్తున్నట్లు సైతం నోటీసులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ ఐ సుబ్బారావు, సిబ్బంది సుధీర్ పాల్గొన్నారు.