పయనించే సూర్యుడు మార్చి 29 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండల కేంద్రానికి చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న రాత్రి బస్సు సమస్యపై చర్యలు ప్రారంభమయ్యాయి. గతంలో నెల్లూరు నుండి రాత్రి 09:50 గంటలకు నడిచే ‘శివ ఫాస్ట్’ బస్సు సర్వీస్ 5 ఏళ్ళుగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు నివాసితులు వెల్లడించారు.అయితే వ్యాపారస్తులు, ఉద్యోగులు తమ పనులు ముగించుకుని తమ తమ గ్రామాలకు చేరుకునేందుకు ఈ సర్వీస్ ఎంతో ఉపయోగకరంగా ఉండేదని, ప్రస్తుతం రాత్రి 08:30 తర్వాత బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. దీనివల్ల ఆర్థిక భారం, భద్రత సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి జోక్యం అధికారులకు ప్రతినిధి పత్రం ఈ సమస్యను రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన మంత్రి నెల్లూరు రీజినల్ మేనేజర్ షేక్. షమీమ్ కు ప్రతినిధి పత్రం ఫార్వర్డ్ చేశారు.మంత్రి ద్వారా రిప్రజెంటేషన్ ను చేజర్ల మండల టీడీపీ అధ్యక్షుడు షేక్ సిరాజుద్దీన్, భారత్ మహాసేన నాయకుడు జువ్విగుంట బాబు, ఎల్‌వి ప్రసాద్ నెల్లూరు రీజినల్ మేనేజర్ షేక్ .షమీమ్ కి అందజేశారు. స్పందించిన రీజినల్ మేనేజర్ షేక్. షమీమ్, నెల్లూరు 1 డిపో మేనేజర్‌తో చర్చించి ఒక వారంలో ‘శివ ఫాస్ట్’ బస్సు సర్వీసును పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంపై స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తూ, త్వరితగతిన సర్వీస్ ప్రారంభించాలని కోరుతున్నారు.
