
పయనించే సూర్యుడు మార్చి 29, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్తో పాటు, 2025-26 సవరించిన బడ్జెట్ను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్, కమిషనర్ , కౌన్సిల్ సభ్యుల సమక్షంలో జరిగిన సమావేశంలో పట్టణాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఈ బడ్జెట్ను రూపొందించారు. మున్సిపాలిటీకి వివిధ వనరుల ద్వారా మొత్తం రూ. 65.24 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేయడమైంది. రూ. 7.64 కోట్లు. భవన నిర్మాణ అనుమతుల కోసం రూ. 5 కోట్లు వెచ్చించారు .ప్రభుత్వ గ్రాంట్లు: రూ. 49 కోట్లు. స్టాంప్ డ్యూటీ: రూ. 1.90 కోట్లు, పారిశుధ్యం (రూ. 1.25 కోట్లు), అద్దెలు (రూ. 22 లక్షలు), ఇంజనీరింగ్ విభాగం (రూ. 23 లక్షలు), డిపాజిట్లు (రూ. 50 లక్షలు) మొత్తం రాబడికి అనుగుణంగా వ్యయాలను కూడా విభజించారు. రూ. 5 కోట్లు. హరిత బడ్జెట్ (పర్యావరణం): రూ. 2.02 కోట్లు ప్రతి వార్డు అభివృద్ధి కోసం రూ. 1.76 కోట్లు వెనుకబడిన ప్రాంతాల కోసం రూ. 63 లక్షలు ప్రత్యేకంగా కేటాయించారు .పారిశుధ్యం కోసం రూ. 1.70 కోట్లు, విద్యుత్ ఛార్జీలు రూ. 1.22 కోట్లు, ఇతర ఖర్చులు రూ. 3.17 కోట్లు , రాష్ట్ర ప్రభుత్వాల నుండి అందిన రూ. 49 కోట్లను పూర్తిగా అభివృద్ధి పనుల కోసం వెచ్చించనున్నారు.