టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి .

ఆదోని టిడిపి ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు పిలుపు

పయనించే సూర్యుడు మార్చ్ 29 కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్. మార్చి 29న జరిగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నియోజకవర్గంలోని ప్రతి వార్డు లో, గ్రామంలో ఘనంగా నిర్వహించాలని ఆదోని టిడిపి ఇన్చార్జ్, మీనాక్షి నాయుడు , మరియు టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో, గ్రామంలో పార్టీ జెండా దిమ్మెలు ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అందరూ రేపు ఉదయం 9:30 గంటలకు నందమూరి తారక రామారావు విగ్రహం దగ్గరకు రావాలని సూచించారు. నందమూరి తారక రామారావు విగ్రహానికి పులహరం వేసి అక్కడ నుండి ఆదోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీనాక్షి నాయుడు చేతుల మీదుగా పార్టీ జెండా ఎగరవేయడం జరుగుతుంది. మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కొంతమంది పేర్లు పంపించడం జరిగింది వారికి పెద్దాయన చేతుల మీదగా సన్మానించడం జరుగుతుంది, అయిన తర్వాత విజయవాడ తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జూమ్ మీటింగ్ ద్వారా నాయకులు కార్యకర్తలతో మాట్లాడడం జరుగుతుంది, ఈ కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు, నందమూరి అభిమానులు, వార్డు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్లు, యూనిట్ సబ్బులు, బూత్ కన్వీనర్లు, పార్లమెంట్ కమిటీ నాయకులు, నియోజవర్గ కమిటీ నాయకులు, రావలసిందిగా తెలిపారు.తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రావలసిన వేదిక. తేదీ న : 29/03/2026 ఉదయం : 9:30 గంటలకు స్థలం : నందమూరి తారక రామారావు విగ్రహం దగ్గరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రావలసిందిగా కోరడమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *