దిగ్విజయంగా పూర్తి చేసుకున్న వార్డు సభ్యుల మొదటి విడత శిక్షణా తరగతులు.

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 29, తల్లాడ రిపోర్టర్ గత ఐదు రోజులుగా స్దానిక రైతు వేదిక నందు మొదటి విడత 9 గ్రామ పంచాయితీల వార్డు సభ్యులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు ఈ రోజుతో ముగిసాయి, చివరి రోజు కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి, కోర్స్ కో ఆర్డినేటర్ అయిన శ్రీ అంబటి శ్రీధర్ రాజు హాజరై ఈ వారం రోజులు మీరు తీసుకున్న శిక్షణను క్షేత్రస్దాయిలో అమలు చేసి అన్ని రకాలుగా గ్రామాభివృద్ధికి దోహాదపడాలని కోరారు, ఈ కార్యక్రమంలో పాల్గోన్న గౌరవ సర్పంచ్ కు వేసివి కాలం దృష్ట్యా మంచి నీటి కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకొవాలని సూచించారు, అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న వార్డు సభ్యులకు ధృవీకరణ పత్రాలు, షీల్డ్స్ మరియు జనపనార బ్యాగులు అందజేశారు, ఈ సందర్బంగా పర్యావణానికి హాని చేసే ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా జూట్ బ్యాగ్ లు అందజేయడం జరిగిందని తెలిపారు, పలువురు వార్డు సభ్యులు మమ్మల్ని గుర్తించి మాకు ఐదు రోజులు శిక్షణ ఇచ్చిన మండల సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఎంపిఓ శ్రీ ఏనుగు సురేష్ బాబు, మండల వ్యవసాయధికారి శ్రీ తాజుద్దీన్ , వ్యవసాయ విస్తరణ అధికారులు,ప్రత్యేక శిక్షకులు శ్రీ జొన్నలగడ్డ పరుశురాం, స్దానిక పంచాయితీ కార్యదర్శి శ్రీ యస్ యూ యం వి కృష్ణారావు , గౌరవ సర్పంచ్ లు, పంచాయితీ కార్యదర్శులు మరియు మండల పరిషత్ సిబ్బంది పాల్గోన్నారు.