దొంగలించబడ్డ సొత్తు లభ్యం

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 29.03.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) దొంగలించబడ్డ సొత్తు లభ్యం కావడంతో స్వామివారి మహిమగా భావించి పూజలు చేసిన సంఘటన రాజనాల మండపై చోటుచేసుకుంది మదనపల్లి బసినికొండ కు చెందిన ఒక రూమ్ లో 12 మంది కలసి ఉండేవారు. వారు అందరూ కలసి చెట్లు కోసేవారు. గురువారం రాత్రి చెట్లు కోసే మిషన్ సుమారు 50,000/- విలువగలది. దొంగలించబడినది. ఐతే శుక్రవారం రోజంన ఉదయాన్నే రాజనాల బండ ఆంజనేయ స్వామి దేవస్థానం లో సత్య ప్రమాణం చేయడానికి రసీదు తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం మిషన్ రూములో ప్రత్యంక్షం అయ్యింది. శనివారం ఉదయం పూజలు చేసి తీసుకొని వెళ్ళారని దేవస్థాన ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి స్వామి తెలియజేశారు.