పయనించే సూర్యుడు మార్చి 29, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). నాగులవంచ గ్రామంలోని శ్రీ గజగిరి లక్ష్మీనరసింహస్వామి మరియు శ్రీ కోదండ రామాలయ దేవస్థాన నూతన పాలక కమిటీ శనివారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేసింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఖమ్మం డివిజన్ ఇన్స్పెక్టర్ సమత ఆధ్వర్యంలో ఆలయ సన్నిధిలో ఈ కార్యక్రమం నిర్వహించారు.నూతన కమిటీ చైర్మన్‌గా ముత్తినేని వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించగా, సభ్యులుగా సిరిసాని రమణ ప్రసాద్, వేముల కృష్ణ, ఏటుకూరి శిరీష, వెగ్గలం పాండు రంగాచారి (సీతంపేట), పడిశాల మైసయ్య, వెచ్చ మంగయ్య, పణిహారం వెంకట రమణ చార్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త మంత్రోచ్చారణలతో నూతన కమిటీ సభ్యులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. స్టేజ్‌పై అధిక సంఖ్యలో ప్రజలు ఎక్కడం వల్ల ఒక్కసారిగా స్టేజ్ కూలిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామకోటేశ్వరావు, పూజారి యోగాంద్రాచార్యులు, మాజీ చైర్మన్ నారగాని శ్రీనివాసరావు, మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ నారగాని రాంబాయి, ఉప సర్పంచ్ అంబటి శరత్, మాజీ సర్పంచ్ కంభం వీరభద్రం తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.