
పయనించే సూర్యుడు న్యూస్, మార్చి 29 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ):నగర పంచాయతీలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పైలా సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ శిక్షణ తరగతులు కార్యక్రమం శుక్రవారం జరిగింది.ఈ కార్యక్రమంలో ముందు రోజు సాయంత్రం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ పార్టీ ఆఫీసులో కలుసుకొని రాత్రి అక్కడే బస చేసి ఈరోజు ఉదయం తెల్లవారుజామునే లేచి యోగా ఆసనాలు వేసి ఆ తదుపరి అల్పాహారం భుజించిన తర్వాత భారతీయ జనతా పార్టీ జిల్లా నుంచి వచ్చిన పెద్దలతో వివిధ కాలాంశముల గురించి భారతీయ జనతా పార్టీ విశిష్టత గురించి సవివరంగా వివరించడం జరిగింది. తదనంతరం అందరూ భోజనాలు చేసి మరి కొంతసేపు కార్యక్రమం నిర్వహించుకుని ముగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం అర్బన్ మండలాధ్యక్షుడు పైల అయ్యప్ప ఏలేశ్వరం రూరల్ మండల అధ్యక్షుడు నీలి సురేష్ జిల్లా నుంచి వచ్చిన కుండల సాయికుమార్, సింగిలీదేవి సత్తిరాజు, ఉమ్మడి వెంకట్రావు, డి, వీఎస్ రాజు, గంగాధర్, చింతల పాండవులు, కర్రోదు గణేష్, పొన్నాడ సత్తిబాబు, రౌతు వెంకన్న బాబు, సామంతుల భక్తాంజనేయ, పొట్లూరి అప్పారావు, గండేటి వేణు, కూరాకుల రాజా, నీరుకొండ సత్యనారాయణ, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.