పయనించేసూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 29.03.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) మండల కేంద్రమైన చౌడేపల్లిలో పారిశుధ్య చర్యలను చేపట్టారు డిప్యూటీ ఎంపీడీవో ఎస్ ఏ గఫూర్ ఆధ్వర్యంలో పట్టణంలోని గోసల కురపల్లి బీసీ కాలనీ పట్టణ శివారు ప్రాంతాలలో పూడిపోయిన కాలువలు చెత్తాచెదారాన్ని తొలగించారు ఇళ్ల మధ్యలో పారి శుధ్యాన్ని పాటించాలని కాలువలలో వ్యర్థ పదార్థాలు వేయరాదని డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ స్థానికులకు సూచించారు ఉదయాన్నే ఇళ్ల వద్దకు వచ్చే పంచాయతీ బండ్లలో తడి చెత్త పొడి చెత్తను వేయాలన్నారు వ్యక్తిగత శుభ్రత పాటించి అంటువ్యాధులకు దూరంగా ఉండాలని ఆయన కోరారు పంచాయతీ కార్యదర్శి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు