పాదయాత్రగా వెళ్తున్న హనుమాన్ స్వాములకు పండ్లు పంపిణీ.

* హనుమాన్ మాలాదారులకు పండ్లు పంపిణీ చేస్తున్న దృశ్యం.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 29 సాలూర : హనుమాన్ మాలదారులు కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తున్న సందర్భంగా సాలూర మండలం ఖాజాపూర్ సాలూర శివారులో హనుమాన్ స్వాములకు హున్సా శ్రీనివాస్,సోంపూర్ నాగనాథ్ లు అరటి పండ్లను పంపిణీ చేశారు.పండ్లు వితరణ చేసిన దాతలు స్వామివారి ఆశీస్సులతో సుఖసంతోషాలు అష్టైశ్వర్యాలు కలగాలని హనుమాన్ మాలాదారులు దీవించారు.వారికి ఎల్లవేళలా స్వామి వారి కృపాకటాక్షాలు ఉండాలని భగవంతుడిని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రజలు,హనుమాన్ మాలాదారులు తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *