పేద కుటుంబానికి అండగా నిలిచిన సామాజిక నాయకుడు వడ్ల ప్రశాంత్ చారి

మానవత్వంతో స్పందించి 2000 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేత

పయనించే సూర్యుడు మార్చి 29, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజాపూర్ మండల కేంద్రం రాయపల్లి గ్రామంలోని నిరుపేద అయినటువంటి పాశం జంగమ్మ మృతి ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ యువ సామాజిక నాయకుడు వడ్ల ప్రశాంత్ చారి, వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించి, వారి దీనస్థితిని చూసి చలించిపోయారు. తన వంతు బాధ్యతగా అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ. 2000/- ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్ననూరు యాదమ్మ, సత్యమ్మ, నరిగె పోషమ్మ, పేర్కె ఆంజనేయులు, బొంకురు మల్లేష్, దూళ్ళ నందేష్, అత్తెల పర్వతాలు, దూళ్ళ సాయిలింగం, పాలెం సూరిబాబు గౌడ్, మొగిలి రాజేష్ మరియు ఇతర గ్రామస్తులు పాల్గొని జంగమ్మ కు నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *