పయనించే సూర్యడు మార్చి 29 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు సమాజ సేవలో విశేష కృషి చేస్తున్న నడిగూడెం మండలం, రత్నవరం గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది, స్వేచ్ఛ ఎన్జీవో ఫౌండర్ చల్లా కోటయ్యకు ప్రతిష్టాత్మక “పొదిల ఫౌండేషన్ ఉగాది పురస్కారం – 2026” లభించింది. శనివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకులు ఆయనకు ఈ అవార్డును అందజేశారు. న్యాయవాదిగా తన వృత్తిని కొనసాగిస్తూనే, సామాజిక అంశాల పట్ల కోటయ్య చూపిస్తున్న చొరవను ఈ సందర్భంగా నిర్వాహకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సేవ్ ఎర్త్ ఫౌండర్ డాక్టర్ సురేందర్ పాల్గొని ఆయనను ఘనంగా సన్మానించారు. తన సేవలను గుర్తించి పురస్కారాన్ని అందజేసిన పొదిల ఫౌండేషన్ వారికి చల్లా కోటయ్య కృతజ్ఞతలు తెలిపారు.