ప్రాథమిక పాఠశాలలో అన్యువల్ డే మరియు వీడుకోలు కార్యక్రమనికి హాజరైన

విలసాగర్ సర్పంచ్ ఏనుగుల కనకయ్య

పయనించే సూర్యుడు మార్చి 28 కరీంనగర్ న్యూస్: ఈరోజు విలాసాగర్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో వీడ్కోలు మరియు అన్యువల్ డే మరియు పిల్లలకు షూ పంపిణీ కార్యక్రమం లో భాగంగా విలాసాగర్ సర్పంచ్ ఎనుగుల కనుకయ్య గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ కనుకయ్య ఉప సర్పంచ్ పొత్తూరి శైలజ మరియు వార్డ్ మెంబర్ జోగు శంకర్ ప్రాథమిక పాఠశాల పిల్లలకు ఉచిత షూ పంపిణీ చేసి సర్పంచ్ మాట్లాడుతూ పిల్లలు అందరూ చక్కగా చదువుకొని ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయిలో ఉండాలని సర్కారు బడిలో చదివి గమ్యాన్ని చేరాలని, పిల్లలందరికీ షూ పంపి నీ చేయడం జరిగింది. ఐదవ తరగతి పిల్లలకు వీడ్కోలు పలికారు. పిల్లలందరూ ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లేశం విలాసాగర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోలగం శ్రీనివాస్ సార్, అంగన్వాడి టీచర్ గోట్ల శైలజ గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *