బదిలీ అయినా కార్యదర్శికి ఘన సన్మానం.

★ సన్మానం చేస్తున్న గ్రామస్తులు.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 29 సాలూర : సాలూర మండలం జాడి జమాల్ పూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించి బదిలీపై వెళుతున్న కార్యదర్శి దయాకర్ రెడ్డిని గ్రామస్తులు శనివారం శాలువాలతో ఘనంగా సన్మానించారు.కార్యదర్శి గ్రామస్తులకు సహకరిస్తూ అనేక సేవలు అందించాలని గుర్తు చేశారు.ఆయన సేవలు మరువలేమన్నారు.ఆయన మరిన్ని ఉన్నతమైన పదవులు పొంది దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శ్రీనివాసరావు,చిన్నయ్య,మజర్ అలీ,పులి అంజి,గౌతమ్,శౌరి కౌటిల్య,పంచాయతీ సిబ్బంది గాంధీ,సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.