పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 29 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ మండల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని, గత ఐదేళ్లుగా వారు అందించిన సేవలు ఎంతో అభినందనీయమని బిక్కవోలు ఎంపీపీ తెతలి సుమ మరియు అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ జుత్తుక సూర్యకుమారి పేర్కొన్నారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు బిక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలో "మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం" శనివారం ఘనంగా జరిగింది. వచ్చే ఏప్రిల్ 2వ తేదీతో సర్పంచుల పదవీకాలం పూర్తి కానున్న నేపథ్యంలో, మండలంలోని సర్పంచులందరినీ ఎంపీపీ తెతలి సుమ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ జుత్తుక సూర్యకుమారి మాట్లాడుతూ, గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి సర్పంచులు అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. అనంతరం వారికి జ్ఞాపికలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ డైరెక్టర్లు, కూటమి నాయకురాలు వేణమ్మ, బిక్కవోలు మండల కూటమి నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.