పయనించే సూర్యుడు మార్చి 29 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినేపల్లి మండల కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ (బాయ్స్) స్కూల్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. గత ఐదు సంవత్సరాలుగా నిరంతరంగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామ ప్రజలు మరియు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు బిజినేపల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సంతోష్ సాగర్, ఆంజనేయులు, నరేష్, ఆర్టీసీ అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.