బూర్గుల లో ఇందిరమ్మ ఇళ్లు శంకుస్థాపన

సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన

పయనించే సూర్యుడు మార్చి 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఫరూక్నగర్ మండలం బూర్గుల గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బూర్గుల గ్రామానికి చెందిన కుంటోల్ల రుకమ్మ బుచ్చయ్య దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కమ్మరి నర్సింలు మరియు ఇందిరమ్మ కమ్యూనిటీ సభ్యులు పరశురాం పుల్లని జగన్ పుల్లని జంగయ్య మరియు పెద్దింటి రాము, ప్రభాకర్ యాదవ్, కుంటుల్ల ప్రవీణ్, చాకలి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.