
పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 29 రిపోర్టర్ అభి నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టే దిశగా ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు మంత్రాలయం నియోజకవర్గాన్ని ముందంజలో నిలపాలని లక్ష్యంగా జాబ్ మేళాను నిర్వహించినట్లు టీడీపీ ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో యువ నాయకుడు ఎన్. రాకేష్ రెడ్డి సహకారంతో మంత్రాలయం నియోజకవర్గంలో రెండో జాబ్ మేళాను ఘనంగా నిర్వహించారు. మాధవరం గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి యువత పెద్ద సంఖ్యలో హాజరై, వివిధ సంస్థలు అందించిన ఉద్యోగ అవకాశాలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్ రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ, యువతకు ఉపాధి కల్పననే ప్రధాన లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు స్థానిక నాయకులు యువత భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని యువతకు ప్రోత్సాహం అందించారు. మంత్రాలయం ప్రాంతంలో ఇలాంటి జాబ్ మేళాలు మరింతగా నిర్వహించి నిరుద్యోగాన్ని తగ్గించేందుకు చర్యలు కొనసాగిస్తామని నిర్వాహకులు వెల్లడించారు.