మార్జిన్ ఇవ్వాలంటూ చికెన్ సెంటర్ యజమానుల ఆందోళన

"పౌల్ట్రీ ఫార్ములా కంపెనీలు మార్జిన్ ఇవ్వాలని వ్యాపారుల ఆందోళన"

పయనించే సూర్యుడు మార్చి 29 రాజేష్) దౌల్తాబాద్ మండలం కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో చికెన్ షాపుల యజమానులు బంద్‌కు పిలుపునిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సూరంపల్లి రాయల్ చికెన్ సెంటర్ నిర్వాహకుడు సాజిద్ భాష మాట్లాడుతూ, ఏప్రిల్ 1, తేదీన నుండి నుంచి తమ చికెన్ షాపులను పూర్తిగా బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు.
గతంలో కిలోకు రూ.5 నుంచి రూ.6 వరకు మార్జిన్ లభించేదని, ప్రస్తుతం పౌల్ట్రీ ఫార్మ్‌ల నుంచి వచ్చే పెరిగిన రేట్ల కారణంగా ఎలాంటి లాభం లేకుండా వ్యాపారం నడపాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “మార్జిన్ లేకుండా వ్యాపారం చేయడం అంటే నష్టాల పాలవ్వడమే” అని స్పష్టం చేశారు. చికెన్ సెంటర్లపై ఆధారపడి జీవిస్తున్న చిన్న వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారిందని, తమకు భూములు లేదా ఇతర ఆదాయ వనరులు లేకపోవడంతో జీవనోపాధి పూర్తిగా ఈ వ్యాపారంపైనే ఆధారపడిందని తెలిపారు. ఈ పరిస్థితిలో వ్యాపారం కొనసాగించడం అసాధ్యమైందని పేర్కొన్నారు. పౌల్ట్రీ ఫార్మ్ కంపెనీలు తగిన మార్జిన్ ఇవ్వాలని, అలాగే పౌల్ట్రీ వ్యాపారాన్ని కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి చిన్న వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించాలని వారు కోరారు. సమస్యకు సరైన పరిష్కారం వచ్చేవరకు చికెన్ షాపులను బంద్ చేస్తామని వ్యాపారులు హెచ్చరించారు. తమ డిమాండ్లు పట్టించుకోకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *