యడ్లపాడు మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా నియామకం – కృతజ్ఞతలు తెలిపిన యువ నాయకుడు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 29 యడ్లపాడు మండల ప్రతినిధి యడ్లపాడు మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా తనను నియమించడం పట్ల యువ నాయకుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు విడదల రజిని కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, విద్యార్థి విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, యువతలో అవగాహన పెంపొందించడం, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే యడ్లపాడు మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరి సహకారంతో మండలంలో పార్టీని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తానని ధీమా వ్యక్తం చేశారు