యాప్ ను తొలగించి పాత పద్ధతిలో యూరియా పంపిణీ చేయాలి.

* పెంటాకలాన్ సొసైటీ పరిధి రైతుల డిమాండ్. * యూరియా పంపిణీ నిరంతర ప్రక్రియగా కొనసాగించాలి. * సొసైటీ మహాజనసభ నిర్వహణ.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 29 బోధన్ :ప్రస్తుతం ఉన్న యాప్ పద్ధతిని తొలగించి పాత పద్ధతిలో యూరియా పంపిణీ చేయాలని మహాజనసభలో రైతులు డిమాండ్ చేశారు.శనివారం బోధన్ మండలం పెంటాకలాన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సంఘ ప్రత్యేక అధికారి ఏ.రవీందర్ అధ్యక్షతన మహాజనసభను నిర్వహించారు.అర్ధవార్షిక గణనకు సంబంధించిన జమా ఖర్చులను రైతుల సమక్షంలో సంఘ సీఈవో బాబా చదివి వినిపించి ఆమోదించారు.యూరియా యాప్ ను తొలగించి పాత పద్ధతిన యూరియా పంపిణీ చేయాలని, యూరియా ఎల్లవేళలా అందుబాటులో ఉంచుతూ నిరంతర ప్రక్రియగా యూరియా పంపిణీ జరిగే విధంగా చూడాలని,సహకార సంఘం భవనంపై నూతన భవనం నిర్మించుట,సహకార సంఘ ఆవరణలో నీటి సమస్యను పరిష్కరించుట,సంఘ పరిధిలోని గ్రామాలకు మాత్రమే యూరియా పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవడం వంటి ప్రధాన అంశాలపై రైతుల సమక్షంలో ఏకగ్రీవ తీర్మానాలు చేశారు.ఈ సమావేశంలో సంఘ మాజీ చైర్మన్ లు గ్రామ సర్పంచ్ నాయకులు గ్రామాల రైతులు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *