పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 29. చండూరు మండలంలో విద్యుత్ అంతరాయం మూలంగా ఏ ఒక్క రైతు పంట ఎండిపోకుండా చూడాలని బిజెపి కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకట్ రెడ్డి శనివారం చండూరు మండల విద్యుత్ అధికారి పల్లపు సాయి గణేష్ కు చరవాణి ద్వారా కోరారు. అనంతరం చండూరులో రైతులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలంలో పలు గ్రామాల్లో లో వోల్టేజ్ సమస్య ఉందని ఇట్టి లో వోల్టేజ్ సమస్యను అధిగమించాలని అవసరం ఉన్న చోట వ్యవసాయ కనెక్షన్ల వద్ద లోడ్ బ్యాలెన్సింగ్ పనులు చేపట్టి రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేలా అధికార, సిబ్బంది నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. రైతులు కారింగు వెంకన్న, కన్నెగోని యాదయ్య యాదయ్య, సురిగి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.