పయనించే సూర్యుడు, న్యూస్ మార్చ్ 29 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట వికలాంగుల పెన్షన్ను రూ. 6వేలకు పెంచాలని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి (టిఆర్విఎస్) మెదక్ జిల్లా అధ్య క్షుడు మీర్ గియాజ్ ఉద్దీన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా పెంపు ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. నిరుడు రాష్ట్ర వ్యాప్తంగా 44,49,767 మందికి పెన్షన్ రాగా, ప్రస్తుతం 42,80,129 మందికి మాత్రమే వస్తుందని ఆవేదన వ్యక్తంచే శారు. పెన్షన్లు పెంచడానికి డబ్బులు లేవని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. గాంధీ కుటుంబానికి మాత్రం రూ.1000 కోట్లు ఏలా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో వికలాంగుల పెన్షన్ల పెంపునకు నిధులను కేటాయించ లేదు అని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఇందిరాపార్క్ వద్ద సామూహిక నిరాహార దీక్ష చేపట్టిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగులకు ఇస్తామన్న పెన్షన్ పెంచి, ఉద్యోగ, ఉపాధి తో దివ్యాంగుల సమాజాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.