
పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 29 జగ్గయ్యపేట పట్టణంలోని కమ్మర బజార్ 26 వార్డులోని శ్రీ కోదండ రామాలయం దేవాలయం వద్ద స్థానిక ప్రజలు గోగుల వెంకయ్య దంపతులు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా వట్టెం మనోహర్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ప్రాంత నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్ రావు కూడా పాల్గొని శ్రీరామనవమి కళ్యాణము వేడుకలు ఘనంగా నిర్వహించుకుని భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వట్టె మనోహర్ మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజలకు మరియు దేశంలోని హిందువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ శ్రీరాముడు సీతమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని రాబోయే రోజుల్లో ప్రజలందరికీ మంచి జరగాలని ఆ రాముడిని కోరుకున్నట్లు పత్రిక ముఖంగా తెలియజేశారు