సమస్యల పరిష్కారమే ద్యేయంగా చమర్తి ముందడుగు

పయనించే సూర్యుడు 29-03-2026-రాజంపేట న్యూస్ : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి చమర్తి జగన్మోహన్రాజు ముందడుగు వేస్తున్నారు. పట్టణ పరిధిలోని రామ్ నగర్ 6 వ వార్డులో మొదలుపెట్టిన డోర్ టు డోర్ తెలుగుదేశం కార్యక్రమంలో ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి మున్సిపల్ అధికారులతో చర్చించి ఎన్నో నెలలుగా ఉన్న డ్రైనేజీ సమస్యను తన చొరవతో మున్సిపల్ సిబ్బంది, గ్యాంగ్ వర్క్ ద్వారా డ్రైనేజీలు క్లీన్ చేయించి ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రజా సమస్యలపై వెను వెంటనే స్పందించినందుకు, నియోజకవర్గ ఇన్చార్జి జగన్ మోహన్ రాజు గారికి, స్థానిక నాయకులు సంజీవరావు మరియు రాంనగర్ నరసింహకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళుతున్న చమర్తి జగన్మోహన్ రాజు గారికి నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టి అభినందనలు తెలియజేస్తున్నారు.