పయనించే సూర్యుడు మార్చ్ 29 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి సైదాపూర్ రైతు వేదికలో 5రోజులుగా జరుగుతున్న తొలివిడత వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో 14గ్రామాలకు చెందిన 122మంది వార్డు సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ పథకాల అమలు, పారిశుద్ధ్యం, వార్డు సభ్యుల విధులు తదితర కీలక పరిపాలనా అంశాలపై వీరికి నిపుణులు అవగాహన కల్పించారు. గ్రామాలాభివృద్ధికి కృషి చేస్తామని వార్డు సభ్యులు తెలిపారు.