స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ” స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర

పయనించే సూర్యుడు 29-03-2026 చోడవరం రిపోర్టర్ :శ్రవణ్ రాజ్ జాతీయ సేవా పథకం వారి ఆధ్వర్యంలో " సోర్స్ సిగ్రిగేషన్ జీరో వేస్టేజ్ లైఫ్ స్టైల్స్ " స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం ఒకటి రెండు మూడు వారి నిర్వహణలో 28.03.2026 రోజున" సోర్స్ సిగ్రిగేషన్ జీరో వేస్టేజ్ లైఫ్ స్టైల్స్ " మూల విభజన మరియు సున్నా వ్యర్థ జీవనశైలి " ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మరియు కళాశాల విద్యాశాఖ వారి ఆదేశాల మేరకు "స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర" ప్రతి నెల మూడవ శనివారం లో భాగంగా ఈ రోజున కార్యక్రమాలను కళాశాల వైస్ ప్రిన్సిపాల్ఐ వి వి సత్యవతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థుల చేత కార్యక్రమాన్ని నిర్వహించారు. సోర్స్ సిగ్రిగేషన్ మరియు వేస్టేజీ లైఫ్ స్టైల్స్ పై విద్యార్థులకు క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరము కళాశాల ప్రాంగణము మరియు కళాశాల తరగతి గదులు, కళాశాల టాయిలెట్స్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేటట్టు, పీజీ ల్యాబ్స్ గార్డెన్స్ అందంగా తయారు చేశారు. ఐ క్య్ ఏ సి సమన్వయకర్త డాక్టర్ నారాయణ మూర్తి, ఈ కార్యక్రమానికి జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ రత్నభారతి, డి.మాల్యాద్రి,బి.పిచ్చమ్మ, సీనియర్ అద్యాపక్ టు అధ్యాపకులు హెచ్ సుదీర్, వి.అప్పలనాయుడు, డాక్టర్ కృష్ణారావు, డాక్టర్ రాధాకృష్ణ, డాక్టర్ జ్యోతి, డాక్టర్ సంధ్య , డాక్టర్ సూర్యవతి, డాక్టర్ వాసు దేవరాజు, డాక్టర్ శ్రీవెంకటేష్,సరస్వతీ, రామలక్ష్మి, కోమల, కామర్స్ శ్రీనివాసరావు, డాక్టర్ సంతోష్, హేమ గణేష్,ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం పాల్గొన్నారు.