స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర లక్ష్యంతో ముందుకు

ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ.

పయనించే సూర్యుడు మార్చి 29 కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆదోని పట్టణం మండగిరి గ్రామంలో పాల్గొన్న కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ గ్రామాన్ని పరిశుభ్రంగా, అభివృద్ధి దిశగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రజలతో కలిసి స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తూ, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర సాధ్యమని ఆమె పేర్కొన్నారు. ప్రజలతో కలిసి అభివృద్ధి వైపు అడుగులు!ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ తిక్కమ్మ ఎంపీడీవోనాగరాజు సెక్రటరీ శ్రీనివాస్ ఈ ఓ ఆర్ డి నాగరాజు, ఎక్స్ ఎంపీపీ మురళి, బాబురావు, ఎక్స్ కౌన్సిలర్ మారుతి,సోమిరెడ్డి నాగేంద్ర,మల్లి రాజశేఖర్, భరత్, చంద్ర, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *