పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 29 రిపోర్టర్ అభి పెద్దకడబురు మండలం హనుమాపురంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన మోకాసీ వీరేష్ కూలీ పనులకు వెళ్ళాడు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి బీరువాలో 12 గ్రాముల బంగారు నెక్లెస్, 10 గ్రాముల బంగారు టిక్కా, 5 గ్రాముల బంగారు కమ్మలు, 20 తులాల వెండి కడియాలు, 12 తులాల వెండి గొలుసులు, 15 తులాల వెండి కాళ్ల పట్టీలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వీరేష్ తెలిపారు. ఈ ఆభరణాల మొత్తం విలువ సుమారు రూ.1,97,500గా అంచనా వేస్తున్నారు. దొంగతనంపై వీరేష్ పెద్దకడబూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దొంగతనం జరిగిన స్థలాన్ని ఎస్సై మారుతి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మారుతి వెల్లడించారు
