హెల్మెట్ ధరించండి- సురక్షితంగా ఇల్లు చేరండి.

అరైవ్- అలైవ్ కార్యక్రమంలో డిసిపి రాజమహేంద్ర నాయక్.

పయనించే సూర్యుడు, మార్చ్ 29, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని ఇన్స్పెక్షన్ బంగ్లాలో జనగామ జిల్లా పోలీసు వారి ఆధ్వర్యంలో జరిగిన అరైవ్- అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్న డిసిపి రాజమహేంద్ర నాయక్ హెల్మెట్ ధరించండి సురక్షితంగా ఇల్లు చేరండి అన్నారు. బచ్చన్నపేట గ్రామ సర్పంచ్ అల్వాల నర్సింగరావు అధ్యక్షతన జరిగిన హెల్మెట్ పంపిణీ కార్యక్రమంలో జనగామ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు డిసిపి రాజమహేంద్ర నాయక్, ఏ ఎస్ పి పండరి చేతన్ నితిన్ సిఐ అబ్బాయ్య బచ్చన్నపేట ఎస్ హెచ్ ఓ హమీద్ నర్మెట్ట ఎస్సై పాల్గొని మాట్లాడారు. డిసిపి మాట్లాడుతూ మద్యం తాగి వాహనం నడపవద్దని మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని ప్రయాణంలో విధిగా శిరస్రాణం ధరించి సురక్షితంగా గమ్యం చేరాలని, కారు నడిపేవారు విధిగా సీట్ బెల్ట్ ధరించాలని లేదంటే ప్రమాద సమయంలో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావని దానితో తీవ్ర నష్టం జరుగుతుందని వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమం ప్రతినెల చివరి వారంలో తమ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలియజేశారు. ఏ ఎస్ పి మాట్లాడుతూ వాహనదారులు మద్యం సేవించి నడిపితే మొదటి తప్పిదముగా పదివేల జరిమానా విధిస్తున్నారని రెండవసారి కూడా దొరికితే మూడు నెలల జైలు పదివేల జరిమానా కోర్టు విధిస్తుందని కాబట్టి మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. నర్మెట సీఐ అబ్బాయ్య మాట్లాడుతూ ఎంతో భవిష్యత్తు ఉన్న యువత రోడ్డు ప్రమాదాల్లో మరణించడం శోచనీయమని, విధిగా హెల్మెట్లు ధరించి ప్రయాణం చేయాలని సురక్షితంగా ఇల్లు చేరి తమ కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమానికి సహాయం అందించిన సర్పంచ్ అల్వాల నర్సింగరావుని శాలువాతో సత్కరించి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *