పయనించే సూర్యుడు 30-3-2026 గొల్లపెల్లి మండల రిపోర్టర్ ( ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో సామాజిక సేవా కార్యకర్తలు గంగాధర మధుసూదన్, సాతల్ల లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ‘డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నామస్మరణ’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ సబర్మతి యూత్ అధ్యక్షులు వేల్పుల రాము హాజరయ్యారు. తొలుత ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వేల్పుల రాము మాట్లాడుతూ డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచానికి ఆదర్శ పారయమైన మహానుభావుడు ఆయన మనకు ఇచ్చిన గొప్ప వరం రాజ్యాంగం భారత రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి సమానత్వం స్వేచ్ఛ, విద్యా,హక్కులు కల్పించారు ఏ వర్గానికి చెందిన వారైనా సమానంగా జీవించే హక్కు ఉందని స్పష్టం చేశారు.ఇప్పుడున్న మన బాధ్యత ఏమిటంటే కుల వివక్షణ పూర్తిగా తొలగించడం ప్రతి ఒక్కరికి విద్య అందించడం పరస్పరం గౌరవం, సహనం పెంచుకోవడం సమానత్వాన్ని ఆచరణలో పెట్టడం అంబేద్కర్ ఆశయాలను మనం పాటిస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం, అందులోని ఆర్టికల్స్ వల్లే 2024లో అయోధ్యలో రామమందిర నిర్మాణం చట్టబద్ధంగా సాధ్యమైందని ఆయన కొనియాడారు. యువత ఉన్నత చదువులు చదివి, అంబేద్కర్ ఆశయ సాధనలో ముందుండాలని పిలుపునిచ్చారు. దేశంలో ఏ మార్పు రావాలన్నా అది రాజ్యాంగం ద్వారానే సాధ్యమని, అంబేద్కర్ దూరదృష్టిని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అశోక్, యూత్ అధ్యక్షులు,వేల్పుల రామ్,గొల్లపల్లి వెంకటేష్, పొలగాని ఉమేష్, పడాల సుదర్శన్, ఆవుల సాయి, కట్ట రవి, బోండ్ల రాజశేఖర్, జేరిపోతుల రాకేష్, 8వ వార్డు సభ్యులు ఆవుల చందు, వేల్పుల మహిపాల్, బోడపట్ల రాజ్ కుమార్, ముత్త వినిల్ తదితర అంబేద్కర్ వాదులు, గ్రామస్తులు పాల్గొన్నారు.