ఎస్ ఐ ఆర్( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) తో పరేషాన్ లో ప్రజలు..

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి ) మార్చి 30 1950 జనవరి 26 భారత రాజ్యాంగం ఓటు హక్కును కల్పించింది (21 )సంవత్సరాలు వయస్సు కలిగిన ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఓటు హక్కును కల్పించడం జరిగింది. తరువాత 1988లో 61 వ రాజ్యాంగ సవరణ ద్వారా 18 సంవత్సరాలకు తగ్గించారు. కానీ ప్రభుత్వం ఆమోదించిన ఎస్ ఐ ఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) 2002 ఎందుకు.? ఓటర్ జాబితా ప్రక్షాళన పారదర్శకమైన ఓటింగ్ సాధ్యం వివరాలు భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ. ఈ సవరణలు మరణించిన వారి పేర్లను తొలగించి తప్పుడు ఎంట్రీ లను సరిదిద్దుతారు. 18 సంవత్సరాల యువతి యువకులనకు ఓటు హక్కు కల్పించడం. కానీ ఆ సంవత్సరములు దశాబ్ద కాలంగా ఓటర్ జాబితాలో పేరుకుపోయిన సవాళ్లను పరిష్కరించడానికి కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్లను తప్పుగా ఎంట్రీ అయిన వాళ్లను తొలగించడానికి ఆ సంవత్సరాన్ని ఒక ప్రామాణికంగా ఉపయోగించి ప్రస్తుత ఓటర్ల జాబితాకు లింకు చేస్తారు. అంతవరకు బాగానే ఉంది కానీ అప్పుడు సొంత భవనాలు లేకుండా అద్దె భవనాలలో ఉన్న ప్రజల సంగతి ఏమిటి. అందులో చాలావరకు ఓటర్ జాబితాలో ప్రజల పేర్లు కనబడటం లేదు. దీనికి తదుపరి కార్యాచరణ ఏమిటి అని ప్రజలు వాపోతున్నారు. 2002లో తల్లిదండ్రుల పేరు ఓటర్ జాబితాలో ఉంటేనే తల్లిదండ్రులతోనే మ్యాపింగ్ సవరణ చేయడం జరుగుతుంది. కానీ అప్పుడు లిస్టులో తల్లిదండ్రుల పేరు లేనప్పుడు పిల్లల పరిస్థితి ఏమిటి? చాలావరకు ప్రజలు అద్దె భవనాలలో ఉన్నారు. 2022 ఓటర్ జాబితా లో పేరు లేని ఓటర్లను ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియ ప్రత్యామ్నాయ మార్గం ఇస్తుందా లేదంటే ఓటర్ జాబితా నుండి ఓటర్లను తొలగిస్తారా అని భయం బ్రాంతులకు గురవుతున్న ప్రజలు. ముఖ్యంగాఓటర్ సవరణ మైనార్టీలకేనా ఇతరులు ఎవరు మ్యాపింగ్ పై ఇంట్రెస్ట్ చూపించడం లేదు మ్యాపింగ్ కచ్చితంగా ఎప్పటి వరకు కొనసాగుతుంది మరియు ఈనెల వరకే లాస్ట్ అని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం మ్యాపింగ్ విధానంపై ఖచ్చితమైన అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *