పయనించే సూర్యుడు 30-3-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవము ఘనంగా నిర్వహించడం జరిగినది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓరగంటి భార్గవరామ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1982లో మార్చి 29వ తేదీ నాడు హైదరాబాదు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పార్టీని నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసినారు అద్భుతమైన ముహూర్తం బలముతో తెలుగుదేశం పార్టీని స్థాపించి నేటికీ 44 సంవత్సరాలు అవుతున్న పార్టీ ప్రతిష్టమైన కార్యకర్తలతో తెలంగాణలో బలంగా ఉన్న పార్టీ స్థిరంగా ఉన్న కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే ఉన్నారు ఈనాడు తెలంగాణలో అధికారంలో లేకపోయినా ప్రతి గ్రామ గ్రామస్థాయిలో తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన వెంటనే తెలంగాణలో పోలీస్ పటేల్ మరియు పట్వారి వ్యవస్థలు వలన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ప్రజలను తీవ్రమైన హింసలకు గురి చేస్తున్నది.స్వయంగా చూసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పట్టి వారి వ్యవస్థలను కూకటి వేళ్ళతో పెకిలించినాడు బీసీ ఎస్సీ ఎస్టీలకు స్వేచ్ఛ కల్పించినాడు ఆ వర్గాల వారికి రాజకీయంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు అండ దండలు అందిస్తూ ముందుకు పోయేలా తన శక్తిని సామాన్య జనానికి అందించిన మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీస్సులతో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపించి వారిని మంత్రులుగా చేసినారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు పాలన శ్రీరామచంద్రుని పరిపాలనల అద్భుతమైన పరిపాలనందించినాడు అవినీతి రహితమైన రాష్ట్ర రాష్ట్రముగా తీర్చిదినాడు అందులో ముఖ్యంగా తెలంగాణలో అద్భుతమైన పరిపాలన అందించి రాజకీయాలకు దూరంగా ఉన్న వర్గాల వారిని ప్రోత్సహించి బీసీ రిజర్వేషన్లు మహిళా రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచులుగా జెడ్పిటిసిలుగా జెడ్పీ చైర్మన్గా గా గెలిపించి బడుగు బలహీన దళిత వర్గాల సత్తా ఏంటిదో నిరూపించిన వ్యక్తి ఎన్టీ రామారావు ఆశీస్సులతో ఈనాడు తెలంగాణలో అన్ని పార్టీలలో ఎన్టి రామారావు అనే పరిశ్రమ నుండి తయారైన నాయకులే ముఖ్యమంత్రిగా మంత్రులుగా వెలుగొందుతున్నారు ఎన్టీ రామారావు ఆశీర్వాద బలం వల్ల మేము క్రియ శీల కార్యకర్తలుగా వెలుగొందుతున్నాం ఆనాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన వెంటనే పేద ప్రజలకు రెండు రూపాయలకు బియ్యం అందించినాడు సగం ధరలకే జనతా వస్త్రాలు అందించి ఆడపడుచులకు అన్నగా అండగా ఉన్నాడు.ప్రతి గ్రామానికి తారు రోడ్డు స్కూలు సురక్షితమైన మంచినీరు ప్రజల వద్దకే పరిపాలన అందించిన మహానుభావుడు ఎన్టీఆర్ సామాన్య ప్రజలకు అందుబాటులో మండలాలు ఏర్పాటు చేసి ఆ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎమ్మార్వో కార్యాలయం ఎండిఓ కార్యాలయాలు గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు నిర్మించి ప్రజలకు అద్భుతమైన పరిపాలన అందించిన మహానుభావుడు ఎన్టీఆర్ వారిని ఆదర్శంగా తీసుకొని నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటి విప్లవాన్ని సృష్టించినాడు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా వెలుగొందుతున్నారు అంటే ఆది చంద్రబాబు కృషి ఫలితమే ఆయన ముందుచూపు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఒక వరం లాంటిది చంద్రబాబునాయుడు అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్పోర్టు నిర్మాణం చేసినారు అలాగే హైదరాబాదు చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు జినో వ్యాలీ సృష్టికర్త హైదరాబాదులో రోడ్ల విస్తీర్ణం హైదరాబాదును ఇండియాకి రోడ్ మోడల్ గా తీర్చిదిద్దినాడు హైదరాబాదును అద్భుత నగరముగా వెలుగొందుతుందంటే అది ఆయన తపన ఈనాడు హైదరాబాదు గ్రీన్ సిటీగా ముందుకు దూసుకుపోతుంది ప్రపంచంలోని అన్ని పరిశ్రమలు హైదరాబాదు మణిహారంగా నిలుస్తున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన పరిశ్రమలు ఎంతో అందమైన హైదరాబాదును అందించింది చంద్రబాబు నాయుడు మాత్రమే ఆ తరువాత నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ఐటి మినిస్టర్ గా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాడు వారి కృషి ఫలితంగానే విశాఖపట్నంలో గూగుల్ సెంటర్ మెయిన్ బ్రాంచ్ తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్ దే త్వరలో నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అద్భుతమైన తేజస్సుతో ఏపీని ప్రపంచంలోనే అఖండమైన రాష్ట్రముగా తీర్చిదిద్దడానికి విశేషమైన కృషి చేస్తారు అందులో విజయుడు అవుతాడు నారా లోకేష్ అద్భుతమైన మేధస్సు పనిచేస్తున్నాడు ఆయన విజయతీరాలను అందుకొని చరిత్రలో నిలిచిపోయే వ్యక్తిగా ప్రజలు గుర్తిస్తారు నారా లోకేష్ లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కు దొరకడం ఒక వరం లాంటిది ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి అవినీతి కార్యక్రమాలు లేకుండా ముందుకు దూసుకుపోతున్నాడు నారా లోకేష్ ఇలాంటి నాయకుడు దొరకడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న పుణ్యఫలితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ అఖండమైన విధానాన్ని అవలంబించి రాష్ట్రాన్ని ఒక సింగపూర్లా తయారు చేస్తాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది అది ఎన్టీ రామారావు ఆశీర్వాద బలమే 2028 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలి పండగ ఉండాలి ఈ అవినీతి ప్రభుత్వాలను కండంతరాలకు విసిరివేయాలి అద్భుతమైన తెలుగుదేశం పరిపాలనను స్వాగతించాలి సాధించుకోవాలి ముఖ్యంగా మహిళా సంఘాలు తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మహిళా సంఘాల ఏర్పాటు చేసి వారిని బలమైన ఆర్థిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది మహిళలు స్వేచ్ఛ స్వతంత్రాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ అని గుర్తించాలి 2028 ఎన్నికలలో ప్రతి గ్రామ గ్రామాన మహిళలు ముందుండి తెలుగుదేశం జెండా పట్టుకొని తిరగవలసిన బాధ్యత మహిళలపై ఉన్నది తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళల పార్టీ ని గుర్తించాలి మహిళలకు అన్ని రంగాలలో ముఖ్యంగా రాజకీయంగా 33 శాతం రిజర్వేషన్లను కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు ఇది మహిళలు మర్చిపోవద్దు తెలంగాణలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావడానికి మహిళలు రాణి రుద్రమదేవిగా ఝాన్సీ లక్ష్మీబాయి గా మరియు తెలంగాణ సింహం చాకలి ఐలమ్మ ను స్ఫూర్తిగా తీసుకొని తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని కృషి చేయవలసిన బాధ్యత మహిళపై ఉందని కోరుచున్నాం తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ ఎస్సీ ఎస్టీల పార్టీ ఈ సమాజం వారు కచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని ముందుకు కదలాలి స్వతంత్రం వచ్చిన తరువాత బడుగు బలహీన దళిత వర్గాలను మనిషి వేసిన వర్గాల వారిని తెలంగాణలో రాజ్యాధికారం చేపట్టకుండా అడ్డుకోవలసిన బాధ్యత ఈ వర్గాలపై ఉంది తెలంగాణ గడ్డలో పుట్టిన తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడానికి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు సిద్ధంగా ఉండాలి పోరాటం చేయాలి అధికారం సాధించాలి తెలంగాణలో బడుగు బలహీన దళిత వర్గాల రాజ్యాధికారం రావాలంటే తెలుగుదేశం కోసం ఈనాడు యువత ముందుకు కదలాది తెలంగాణలో నిరుద్యోగులుగా ఉన్న లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు రావాలంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడమే ద్వేయంగా పనిచేయాలి ధైర్యంగా ప్రజలకు వెళ్లాలి గతంలో ఉద్యోగ భద్రత కల్పించింది తెలుగుదేశం ఏ పార్టీలు విద్యావంతులను నిరుద్యోగులుగా మార్చి పబ్బం గడుపుతున్నాయి తప్ప ఒక తెలుగుదేశం పార్టీ నే అధికారంలో ఉన్న సమయంలో ప్రతి సంవత్సరం డీఎస్సీ ఏర్పాటు చేసి ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో వేలాది ఉపాధ్యాయులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈనాడు ఎక్కువ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ బీసీలు ఉన్నారంటే అవి తెలుగుదేశం పార్టీతోనే సాధించింది సాధ్యమైంది అని గుర్తించాలి తెలుగుదేశం హయాంలో ఉద్యోగాలు పొందిన ఉద్యోగస్తులందరూ కలిసికట్టుగా 2028 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చుకోవడానికి మీ వంతు కృషి చేయాలి ప్రజలను చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు అభివృద్ధి కాకుండా అడ్డుకోవడానికి రాష్ట్రాన్ని విభజించి దుర్మార్గమైన ఆలోచనలతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసి అవినీతి అక్రమాలతో ప్రజలను మోసగించి ప్రజల యొక్క భూములను కొల్లగొట్టినారు మళ్ళీ వారు అధికారంలోకి వస్తే ప్రజల బతుకులు చాలా దారుణంగా ఉంటాయి కాబట్టి అన్ని వర్గాల ప్రజలను సుఖసంతోషాలతో జీవించాలంటే అద్భుతమైన పరిపాలన అందించిన తెలుగుదేశం పార్టీనే మళ్లీ తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలి కొన్ని పార్టీలు తెలుగుదేశం పార్టీ అంటే ఒక ప్రాంతానికి అంటగడుతూ ప్రజలలో భావోద్వేగాలను కలిగిస్తూ మోసం చేస్తున్నారు అలాంటి మోసకారుల మాయమాటలు నమ్మకుండా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పుట్టిన పార్టీగా ప్రజలు ఆశీర్వదించాలి ఆశిసులు అందించాలి మీ పవిత్రమైన ఓటు హక్కును సైకిల్ సైకిల్ గుర్తుపై వేసి రుణం తీర్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటికి 44 సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భముగా గొల్లపెల్లి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి సంబరాలు చేసుకోవడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఓరగంటి భార్గవ రామ్ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గర్వందుల రవి గౌడ్,రాచర్ల సురేష్,మరియు రాగల్ల శంకర్ రజక మరియు ఊటుకూరి సుధాకర్ రెడ్డి కొప్పుల స్వామి భోజనపు భూపతి ఈర్ల తిరుపతి కురుమ నల్ల మాణిక్యం సాన స్వామి కందుకూరి తిరుపతి బత్తుల ప్రదీప్ పెగడపల్లి ఉపసర్పంచ్ పోలవేణి బొండాలు యాదవ్ సాంబారు సంతోష్ దేవి నరసయ్య పుల్లంగుల నందు సింగారం కొమురయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.