పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా.. జగయ్యపేట్ట నియోజకవర్గం. మార్చి 30 పెనుగంచిప్రోలు.. మండలం. అనిగండ్లపాడు గ్రామంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి, తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు, అనిగండ్లపాడు గ్రామ పెద్దలు మాట్లాడుతు స్వర్గీయ నందమూరి తారక రామారావు కృషిని, తెలుగుదేశం పార్టీ స్థాపించి వారు చేసిన సేవలను కొనియాడారు, ఈ కార్యక్రమం లో గ్రామ పార్టీ అధ్యక్షులు వల్లంకొండ నరసింహారావు, ఎంపీటీసీ పొందూరు విజయలక్ష్మి, సొసైటీ అధ్యక్షులు అత్తులూరి అచ్యుతరావు, పొందూరు వెంకటేశ్వరరావు, షేక్ సోనిమియా, తొట్టెంపూడి మురళి, గంగోరి జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.