చలో ఉట్నూర్‌-గిరిజన బిడ్డల గర్జన..!

★ 30 తేదీన చలో ఉట్నూర్-మహా పాదయాత్ర కార్యక్రమం ఉద్యమ నాయకుల పిలుపు ★ గిరిజన హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు రావాలి

పయనించే సూర్యుడు మార్చి 30 ఉట్నూర్ మండలం రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూర్: ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ మరియు స్థానికులకు దక్కాల్సిన ఉద్యోగాల భర్తీ కోసం “చలో ఉట్నూర్” మహా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఉద్యమ నాయకులు తెలిపారు. జీఓ నెం. 3 రద్దు అనంతరం ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనుల హక్కులు, ఉద్యోగ అవకాశాల విషయంలో అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్, పీసా చట్టం మరియు 1/70 చట్టాల ప్రకారం గిరిజనుల హక్కులు పూర్తిస్థాయిలో అమలు కావాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అమలు సక్రమంగా జరగడం లేదని పేర్కొన్నారు ఏజెన్సీ ప్రాంతాలలో స్థానిక గిరిజనులకు దక్కాల్సిన ఉద్యోగాలు ఇతరులకు వెళ్తున్నాయనే ఆరోపణలతో నిరసన వ్యక్తం చేస్తూ, హక్కుల సాధన కోసం పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ముఖ్యమైన డిమాండ్లు: ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేకంగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి ఏజెన్సీ ప్రాంతాలలో ఉద్యోగాలను 100% స్థానిక గిరిజనులతోనే భర్తీ చేయాలి ఐటీడీఏలో ఖాళీగా ఉన్న సుమారు 10,000 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి 5వ షెడ్యూల్, పీసా చట్టం, 1/70 చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలి గిరిజనుల భవిష్యత్తు, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ విభేదాలు మరిచి ఐక్యంగా “చలో ఉట్నూర్” కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు కోరారు.