
పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 30 జగయ్యపేట్ట పట్టణంలోని ఈరోజు న పెద్ద ఎత్తున ఏసుక్రీస్తు సంకీర్తనలు పాడుకుంటూ ఈరోజున ప్రధాన రహదారి మట్టల పండుగ సందర్భంగా మట్టల ఆదివారం వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సిఎస్ఐ చర్చ్ ఆధ్వర్యంలో సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు సండే స్కూల్ పిల్లలు కలిసి పట్టణ పురవీధుల్లో పూలతో అలంకరించిన మట్టలు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీస్తు భక్తి గీతాలు ఆలపిస్తూ, క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే పామ్ సండే, ఈస్టర్ పండుగకు వారం రోజుల ముందు జరుపుకుంటారు. శ్రమలకాలం (లెంట్ డేస్)లో వచ్చే ఈ రోజు, యేసుక్రీస్తు యెరూషలేములో ప్రవేశించిన సందర్భాన్ని గుర్తుచేస్తూ భక్తి భావంతో జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో సంఘ పాస్టర్లు పాస్టర్ అమ్మలు సంఘ పెద్దలు సంఘవిశ్వాసులు సంఘం నాయకులు సంఘ యవనస్తులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
