బడ్జెట్కు ముద్ర.. అభివృద్ధికి మార్గం

* ఆర్ధిక సంవత్సరం 2026-27 * బడ్జెట్ సమావేశం * మున్సిపల్ కౌన్సిల్స్ సమావేశంలో ఏకగ్రీవ ఆమోదం * పట్టణాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం " మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 30 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపల్ కార్యాల యంలో చైర్మన్ జూపల్లి శశికళ అధ్యక్షతన 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనా బడ్జెట్పై మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించబడింది. సమావేశంలో బడ్జెట్ పై విస్తృతంగా చర్చించిన అనంతరం కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.ఈ బడ్జెట్లో పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, వీధి దీపాలు, శుభ్రత నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అధికా రులు తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికతో బడ్జెట్ రూపొందించబడినట్లు చైర్పర్సన్ జూపల్లి శశికళ పేర్కొన్నారు.పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేం దుకు కౌన్సిల్ సభ్యుల సహకారం ఎంతో అవసరమని ఆమె అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని సూ చించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ జూపల్లి రమేష్, కమిషనర్ బి. నాగరాజు, ఏఈ సురేష్, టి పిఓ శ్రీనివాస రావు తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *