పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 30, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండల కొత్త వెంకటగిరి గ్రామ సర్పంచ్ దీవెల వెంకటేశ్వరరావు గ్రామ ప్రజలకు ఇచ్చిన వాగ్దానము మరోసారి నిరూపించుకున్నారు మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరా అంతరాయం వలన గత రెండు రోజులుగా నీటి ఎద్దడి ఏర్పడటంతో యుద్ధ ప్రాతిపదికగాన గత కొన్నాళ్లగా శిథిలావస్థలో ఉన్నటువంటి బోరు మరమ్మతులు చేపట్టి నూతన మోటార్‌ను బిగించడం జరిగింది సకాలంలో నీటి మరమ్మత్తులు చేపట్టినటువంటి సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామ ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు అనంతరం ఈ సందర్భంగా సర్పంచ్ దీవెన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎలక్షన్ కోసం ఓట్లు కోసం నాలుగు రోజు హడావుడి చేసే అటువంటి పరిపాలన మాది కాదు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వాళ్ళ కష్టాల్లో సుఖాలలో తోడుంటూ గ్రామంలో ప్రజలకు నిత్యం అవసరాలలో అందుబాటులో ఉంటూ గ్రామాన్ని ఆదర్శంగా రూపుదిద్దుటలో నా వంతు పాత్ర ఉంటదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రుద్రాక్ష రామకృష్ణ చారి గ్రామ ప్రజలు పాల్గొన్నారు