రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి

డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

పయనించే సూర్యుడు మార్చి 30 ఉట్నూర్ మండలం రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూర్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కుమురం భీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పిలుపు నిచ్చారు ఆదివారం ఉట్నూర్ మండల కేంద్రంలోని తన నివాసంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఇంద్రవెల్లి మండల సభ్యులతో కలసి జయంతికి సంబంధించిన వాల్ పోస్టర్లను రిలీజ్ చేశారు ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క మాట్లాడారు సబ్బండ వర్గాల హక్కులకై జీవితాంతం పోరాడిన మహానేత అంబేద్కర్ అని అన్నారు.ఏప్రిల్ 14న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో జరిగే అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండి పెద్దఎత్తున తరలి రావాలన్నారు.ప్రతి ఒక్కరూ అంబేద్కర్ మార్గాన్ని అనుసరించి, వారు చూపిన బాటలో నడవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు సోన్ కాంబ్లే జితేందర్,గౌరవ అధ్యక్షుడు కాంబ్లే మనోజ్, ప్రధాన కార్యదర్శి కాంబ్లే మారుతి,కోశాధికారి కాంబ్లే ఉత్తం, రత్న సాన్వీ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు ఉపారపు సత్యరాజ్, హెల్ప్ వీల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాంబ్లే ఆతీశ్, భీం ఆర్మీ మండల అధ్యక్షుడు సూర్యవంశీ ఉత్తం అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ సభ్యులు వాగ్మారే శుద్ధోదన్, గిల్చే నారాయణ, గాయక్వాడ్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *