వంద వారాలు పూర్తి చేసుకున్న హనుమాన్ చాలీసా పారాయణం

పయనించే సూర్యుడు, 30 మార్చి 2026, భీంగల్ మండల్ ప్రతినిధి కొత్వాల్ లింబాద్రి :నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణంలోని నందిగల్లి హనుమాన్ మందిరంలో వంద వారాలుగా దిగ్విజయంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం శనివారం రోజున వందవ వారాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పారాయణం చేశారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు నృత్య ప్రదర్శనలు చేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారే దస్తగిరి, అభి సింగ్ రాఘవేంద్ర తమ ప్రవచనాల ద్వారా హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ వేడుకల్లో భీంగల్ పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.