శ్రీ పరాభవ నామ సంవత్సరం 28 మార్చి 2026 శనివారం శ్రీరామనవమి మహోత్సవం సందర్భంగా కుర ప్ప ల్లె గ్రామంలో విరాజిల్లుతున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం వేడుకలు

★ శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం పూజా కార్యక్రమంలో పాల్గొన్న వి గిరినాథ్ ప్రకాష్ చూపురులను ఆకట్టుకున్నవిద్యుత్ దీపాల అలంకరణ ★ భక్తులకు సౌకర్యార్థం కోసం పెద్ద ఎత్తున ఉచిత అన్నదానం పంపిణీ చేశారు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 30.03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) చౌడేపల్లి మండలం పంచాయతీ కురపల్లెలో విరాజిల్లుతున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా అత్యంత వైభవంగా వేడుకలు జరిగాయి గ్రామస్తులు అందరూ కలిసి ఈ సీతారాముల కళ్యాణ కార్యక్రమం జరిపించారు శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో శ్రీ సీతారాముల స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు వివిధ రకములకు చెందిన రంగురంగుల పూలతో స్వామివారిని అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజించారు అనంతరం వేదమంత్రోత్సరణం మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవాన్ని అత్యంత వేడుకగా జరిపించారుకురప్పల్లె పురవీధులలో శ్రీ సీతారామాంజనేయ ఉత్సవ విగ్రహం కురపల్లె పురవీధుల్లో ఊరేగించారు పెద్దలు భారీ సంఖ్యలో తరలివచ్చారు అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాలు గాండ్ల పల్లె_చారాల కేతన పల్లె చిన్నాగన పల్లె బండమీదపల్లె భక్తులు కూడా ఈ వేడుకలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో వచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రముఖ పారిశ్రామికవేత్త వి గిరినాథ్ ప్రకాష్ స్వామివారికి విశేష పూజలు చేశారు మహిళలు పెద్ద ఎత్తున హాజరై మంగళహారతులతో భక్తి భావాన్ని చాటుకున్నారు చిన్న పిల్లలు కోలాహాలంగా రావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది భక్తుల సౌకర్యార్థం కోసం పెద్ద ఎత్తున ఉచిత అన్నదాన కార్యక్రమాలు జరిగాయి ఈ వేడుకతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది భక్తులు మాట్లాడుతూ శ్రీ సీతారామ ఆంజనేయులు ఎంతో శక్తివంతులని జగదభిరాముడు సకల గుణ దాముడైన సీతారామచంద్రమూర్తిని స్మరిస్తూ అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని భక్తులు అన్నారు ఈ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించి నందుకు నిర్వాహక కమిటీ సభ్యులకు సహకరించిన భక్తులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు చెక్కల భజన బృందం చే స్వామివారి ఊరేగింపు లో హైలైట్ గా నిలిచింది ఈ కార్యక్రమంలో వి గిరినాథ్ ప్రకాష్ మంజునాథ్ వి రమణయ్య జె.సుబ్రహ్మణ్యం వి శ్రీనివాసులు కె రామచంద్ర కె కుమార్ కె జయ చంద్ర భక్తులు తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా అనే నినాదాలతో ఆలయ ప్రాంగణ కిటకిటలాడింది